NLG: మిర్యాలగూడ ప్రధాన పోస్ట్ ఆఫీస్ ప్రజలు ఆధార్ సేవలను వినియోగించుకోవాలని పోస్ట్ మాస్టర్ బాణావత్ ప్రతాప్ సింగ్ నాయక్ కోరారు. నూతన ఆధార్ కార్డు నమోదు, పేర్ల మార్పు, పుట్టిన తేదీ మార్పు, లింగం, ఫోన్ నెంబర్ నమోదు వంటి సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర ఆధార్ సవరణలు కూడా తక్కువ ఖర్చుతో చేస్తున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు.