APమాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి CBI కోర్టు క్లోజ్ చేసింది. ఇవాళ కోర్టులో జగన్ హాజరైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై CBI అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని వాదించింది. దీనిపై కోర్టు ఏకీభవించింది.