CTR: కృష్ణా జలాలతో కుప్పం సస్యశ్యామలం అవుతుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీ డీకేపల్లిలో కృష్ణమ్మకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ జలాలతో ప్రాంతంలోని చెరువులు నిండి ఇక్కడి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హంద్రీనీవాతో ఈ ప్రాంతం నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందన్నారు.