KDP: సిద్ధవటం గ్రామ శివారులో వెలిసిన ఓబులమ్మ తల్లి అమ్మవారికి ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. కార్తీక వనభోజనాల సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమతో వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకులు వీధి మహిళలు, ఎగువ పేట గ్రామస్తులు పాల్గొన్నారు.