ఏపీ మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు విచారణకు హాజరుకావడంపై ఆయన లాయర్ స్పందించారు. ‘కోర్టు ఆదేశాలతో జగన్ విచారణకు హాజరయ్యారు. విదేశీ పర్యటన పిటిషన్ విచారణ కోసమే జగన్ కోర్టుకు వచ్చారు. జగన్ హాజరవడంతో విదేశీ పర్యటన పిటిషన్ను కోర్టు క్లోజ్ చేసింది. ఛార్జిషీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదు’ అని పేర్కొన్నారు.