VSP: గాజువాక-పెదగంట్యాడలో అదానీ అంబుజా సిమెంట్ 40 లక్షల టన్నుల యూనిట్ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు మేయర్ పీలా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ యూనిట్ వల్ల ప్రాంతంలో తీవ్ర కాలుష్యం, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. నగర పౌరుల తరఫున ఎజెండా పెట్టి ప్రతిపాదనను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.