KMR: రైతును రాజుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం భిక్కనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రూ. 93 లక్షల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.