TG: సౌదీ ప్రమాదంలో మృతుల కుటుంబాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విద్యానగర్లోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లిన కేటీఆర్, మహమ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటంబీకులకు ధైర్యం చెప్పారు. సౌదీ దుర్ఘటనలో నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది మరణించడం అత్యంత బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. నసీరుద్దీన్ కుటుంబానికి BRS అండగా ఉంటుందని భరోసానిచ్చారు.