ELR: ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఇవాళ ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను విజయవాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని ముఖ్య సమస్యలు, పెండింగ్ బిల్లులు, నిధుల విడుదల, రహదారుల మరమ్మతులు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.