KNR: తిమ్మాపూర్లో రాజీవ్ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద మనుషులను పోలిన పోలీస్ బొమ్మలను గురువారం ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ప్రతి చౌరస్తా వద్ద భారీ బారికేడ్లను అమర్చారు. ఈ సరికొత్త ఆలోచనలతో ప్రమాదాలను తగ్గించవచ్చని ఎల్ఎండి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.