RR: మాజీమంత్రి కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అంశాలపై ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఫార్ములా ఈ కేసు ప్రభుత్వ కక్ష పూరిత ధోరణికి ఉదాహరణ అన్నారు. అక్రమ కేసులతో నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు.