గ్రీన్ టీ/హెర్బల్ టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా పుదీనా, చామంతి టీలు మంచివి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర కలపని తాజా దానిమ్మ రసం, నారింజ రసం వంటివి శక్తిని తక్షణమే పెంచుతాయి.