WNP: చిన్నంబావి మండలంలోని 17 గ్రామాల్లో శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి సీసీ కెమెరాలు అత్యంత కీలకమని గురువారం ఎస్సై నాగరాజు తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాలను సులభంగా నియంత్రించవచ్చని అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ విషయంలో సహకరించాలని కోరారు.