WNP: పట్టణంలోని సాయి మందిరంలో ఈనెల 23న భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శతజయంతి ఉత్సవాలకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ రమేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మండ్ల దేవన్న నాయుడు, తదితరులు పాల్గొన్నారు.