SRPT: కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీఐటీయూ సూర్యాపేట జిల్లా కోశాధికారి నారాయణ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో, హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈనెల 25న సూర్యాపేటలో జరగనున్న సీఐటీయు జిల్లా మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.