E.G: గోకవరం మండల సర్వసవ సమావేశం ఎంపీపీ సుంకర శ్రీ వల్లి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మండలంలో దోమల బెడద ఎక్కువగా ఉందని ఎంపీపీ సుంకర శ్రీవల్లికి తెలపడం జరిగింది. దోమల నివారణకు పంచాయతీరాజ్ శాఖ, వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని ఎంపీడీవో ఆదేశించారు.