శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మూడు రోజుల్లో 3 లక్షల మందికిపైగా అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్‌ను ఈనెల 24 వరకు కేవలం 5 వేలకే పరిమితం చేసింది.