NRPT: దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ని బుధవారం పట్టుకున్నట్లు ఎఎస్సై అరుణ్ తెలిపారు. నారాయణపేట మండలం షేర్నపల్లి గ్రామం నుంచి మొగుల్మడ్క గ్రామానికి ఇసుక తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్ అశోక్, యజమాని శివకుమార్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.