ADB: కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.