KMM: ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు మహిళలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం రఘునాధపాలెం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం వద్ద చేపట్టనున్న బాల సదనం భవన నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజున మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.