TG: ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుతం గతుకులు ఉన్నందున వెంటనే బీటీ రోడ్డు పనులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. మేడారం జాతర నాటికి బీటీ రోడ్డును పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా కారిడార్‌ను ప్రారంభిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.