NLG: ఎన్జీ కాలేజీలో పీజీ ప్రవేశాలకు మిగిలిన సీట్లను నవంబర్ 22న స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. సీపీజీఈటీ-2025 నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగనున్నాయి. ఎంఎస్సీ (కెమిస్ట్రీ, జూవాలజీ, కంప్యూటర్ సైన్స్), ఎం.కాం, ఎంఏ (తెలుగు, ఎకనామిక్స్) విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి.