SKLM: ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుండి మినహాయించాలని STU జిల్లా అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి అన్నారు. బుధవారం సాయంత్రం పోలాకి, మబగాం పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. డీఎస్సీ ద్వారా కఠిన పోటీని ఎదుర్కొని ఎంపికైన ఉపాధ్యాయులకు మరోసారి అర్హత పరీక్షలు విధించడం సమంజసం కాదన్నారు.