గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన ప్రభుత్వ భూములను రెగ్యులరైజేషన్ చేయాలని ఎమ్మెల్యే నసీర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుకు బుధవారం విజ్ఞప్తి చేశారు. వేణుగోపాలస్వామి ఆలయం, ప్రగతినగర్, ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలోని ఈ భూములను మహిళల ఉపాధి శిక్షణ కేంద్రాలు, మైనారిటీల మౌలిక వసతుల ఏర్పాటుకు వినియోగించాలని కోరారు.