NLG: కొండమల్లేపల్లి మండలం చెన్నారం గేటు వద్ద వాహన తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు 1,800 కేజీల నల్లబెల్లం, 80 కేజీల పట్టికను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా నాటుసారా తయారీలో చేరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.