VKB: తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 1-9 మధ్య జరిగే ప్రజాపాలన వారోత్సవాలకి ముందే గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్, త్రాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.