కోనసీమ: మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రామచంద్రపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే న్యాయస్థానంలో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.