AP: ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్ విధించింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ధర్మాసనం వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలాగే వారికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కాగా, కేంద్ర బలగాలు మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.