ADB: జిల్లాలో మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద చీరల పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,48,052 మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.