HYD: గాంధీ ఆసుపత్రికి కొత్త బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అధికారులు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను సందర్శించి అక్కడి అధునాతన వైద్య విధానాలను పరిశీలించారు. కార్పొరేట్ స్థాయి సేవలు అందించే విధంగా గాంధీ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.