MBNR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం లీగల్ ఎయిడ్ క్లినిక్ జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి ఇందిరా మాట్లాడుతూ.. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అలాగే సీనియర్ సిటిజన్ల ఆస్తి, బాల కార్మిక చట్టాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.