TG: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా రేపటి నుంచి ‘నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్’ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలను నవంబర్ 20, 21, 22 తేదీల్లో మొదటి విడతగా, ఆ తర్వాత నవంబర్ 25, 26, 27 తేదీల్లో రెండో విడతగా నిర్వహించనున్నారు.