KNR: సైదాపూర్ మండల నూతన ఎంఈవోగా ఎక్లాస్పూర్ హైస్కూల్ హెచ్ఎం కట్ట రవీంద్ర చారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. HM ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, మారుతి, రామస్వామి తదితరులు నూతన ఎంఈవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.