AP: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక చెంచు గిరిజనులకు ప్రతినెల ఒకరోజు మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. రూ.500 టికెట్ కొన్న భక్తులకు 2 లడ్డూలు, రూ.300 టికెట్ కొంటే ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వనుంది. ఈ ప్రతిపాదన DEC 1 నుంచి అమలుకానుంది.