NZB: ధర్పల్లి మండలం కోటాలపల్లి గ్రామ శివారులో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోదాసు రాజేష్ (17) అనే యువకుడు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్నేహితుడు సుర ఆకాష్ దుబాయ్ నుంచి తెచ్చిన వస్తువులు తీసుకురావడానికి రామారెడ్డికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై కళ్యాణి తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.