VSP: 2027లో జరగనున్న భారతదేశ జనాభా గణన సర్వేను పక్కాగా నిర్వహించాలని విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన భీమిలి జోన్ మూడవ వార్డు రెల్లి వీధిలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, సెన్సస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. దయాసాగర్ తదితరులతో కలిసి జనాభా గణన సర్వే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.