TG: హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక కీర్తి అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు లిఫ్ట్ డోర్లో ఇరుక్కుపోయాడు. బాలుడు పూర్తిగా బయటికి రాకముందే లిఫ్ట్ డోర్ లాక్ కావడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.