ATP: కార్తీక అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని గంగంపల్లి సమీపంలో కొలువై ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో దీపం వెలిగించి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.