MNCL: బాలికను మోసగించి వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు భీమిని SI విజయ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. కేస్లాపూర్ లో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన కొమురం నరేష్ ప్రేమ పేరుతో లోబర్చుకుని, ఇంటి నుంచి తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.