EG: రాష్ట్రస్థాయి అండర్-19 హాకీ పోటీలకు చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పీడీ జె.విజయలక్ష్మి,హెచ్ఎం వాసవి గురువారం తెలిపారు. ఎంపికైన వారిలో బాలికలు టి.ప్రసన్న, శాంతి, ఎం.భవాని, జోష్ణవి, కృష్ణ శైలజ, జయలక్ష్మి, సిరిమౌనిక, వైష్ణవి, సంజన, బాలుర విభాగంలో సత్యగణేశ్, విజయ ఆనంద్, జయదీప్ ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.