ADB: గిరిజన ఆదివాసీల సమస్యలను అధికారులు పరిష్కరించాల్సిందేనని తుడుందెబ్బ సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో ఆదివాసీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్ ఉందని, దీని పరిష్కారం కోసం ప్రతిఒక్కరు ఏకమవ్వాలని పేర్కొన్నారు.