MDK: రామాయంపేట రైతు వేదిక ఆవరణలో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల రైతులకు దీర్ఘ కాలిక ఆదాయం వస్తుందని, ఈ అవకాశాన్ని సభ్యత్వం చేసుకోవాలని సూచించారు.