GNTR: మంగళగిరి NRI ఆసుపత్రి వెనుక అపార్ట్మెంట్లో నడుస్తున్న బుక్.కామ్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై రూరల్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఆపరేషన్‌లో ఐదు ల్యాప్‌టాప్‌లు, 32 ఫోన్లు, 15 ఏటీఎం కార్డులు, 14 పాస్‌బుక్‌లు స్వాధీనం. ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సీఐ ఏవి బ్రహ్మ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది.