NZB: ఏర్గట్ల ZPTC మాజీ సభ్యుడు గుళ్లే రాజేశ్వర్తో పాటు కాంగ్రెస్ నాయకుడు VDC ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ గురువారం BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాల్కొండ MLA ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం, మాజీ MPP కొలిపాక ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.