HYD: అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. జగన్ రాక నేపథ్యంలో నగరంలో భారీగా వైసీపీ అభిమానులు రోడ్లమీదకు వచ్చారు. ఈ క్రమంలో ‘రప్పా.. రప్పా’ ఫ్లెక్సీ కలకలం రేపింది. “2029లో రప్పా.. రప్పా.. 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే” అంటూ ఫ్లెక్సీలో రాశారు.