AP: విశాఖ మద్దిలపాలెంలోని ఓ కార్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటల ధాటికి 2 కార్లు దగ్ధమయ్యాయి, మరో రెండు కార్లు పాక్షికంగా కాలిపోయాయి. నాలుగు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.