ఏపీ మాజీ సీఎం జగన్ HYDలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరుకావాలని ఇటీవల సీబీఐ తెలిపింది. దీంతో ఈనెల 21లోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్పై ఉన్నారు.