NZB: రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని, ప్రజలకు మొఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక బీజేపీ వాళ్లు, వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని విమర్శించారు.