GNTR: మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని కొండ శిఖర భాగంలోని శ్రీగండాలయ్యస్వామి ఆలయంలో గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు గండ దీపంలో నువ్వుల నూనె పోసి, టెంకాయలు కొట్టి, బెల్లం సమర్పించి కర్పూర నీరాజనాలు చేశారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చి దర్శనం పొందారు.