MDK: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు ప్రచార సభలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావొస్తున్నా పెన్షన్ పెంపు ముచ్చట లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 వరకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.